
వేములవాడ, 25 నవంబర్ (హి.స.)
వేములవాడ మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద పరిశీలనలు నిర్వహిస్తుండగా, బేస్పైకి నాయకులతో కలిసి ఆది శ్రీనివాస్ వెళ్లారు. అప్పుడు ఒక్కసారిగా బేస్మెంట్ కుంగిపోయింది. బీఆర్ఎస్ హయాంలో ప్రారంభమైన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలను కాంగ్రెస్ ప్రభుత్వం పునఃప్రారంభించిన నేపథ్యంలో మంగళవారం పరిశీలన జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. ఘటన జరిగిన సమయంలో వెంట ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ మరియు ఇతర అధికారులు, నాయకులు భయాందోళనకు గురయ్యారు. కాగా ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ముప్పు కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు