
సంగారెడ్డి, 25 నవంబర్ (హి.స.)
బీసీ విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వ హాస్టల్స్ను మరింత మెరుగుపర్చడంలో కార్పొరేట్ సంస్థలు భాగస్వామ్యం కావాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు. సంగారెడ్డిలోని బీసీ అభివృద్ధి కార్యాలయం ఆధ్వర్యంలో బీసీ బాలుర వసతి గృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంగళవారం పట్టణం పరిధి లోని బాలురవసతిగృహం విద్యార్థులకు, హాస్టల్ గడ్డ బీసీ బాలికల వసతి గృహం విద్యార్థులకు కిర్బీ సంస్థ, సీ.ఎస్.ఆర్. నిధుల ద్వారా స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్లు, గ్లాసులు, స్కూల్ బ్యాగులు, ట్రంక్ బాక్సులను, కలెక్టర్ పి ప్రావీణ్య, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తో కలిసి విద్యార్థులకు అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..