
డిల్లీ, 25 నవంబర్ (హి.స.)అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ లో లే ఆఫ్స్ పరంపర కొనసాగుతున్న వేళ.. ప్రపంచ టెక్ దిగ్గజమైన యాపిల్ సంస్థలో కూడా ఉద్యోగులను తొలగించడం కలకలం రేపుతోంది. కంపెనీకి రికార్డు స్థాయిలో ఆదాయం ఉన్నా.. ఎంప్లాయిస్ కు లే ఆఫ్ కార్డు చూపడం చర్చనీయాంశంగా మారింది. లే ఆఫ్ కు గురైన వారిలో 20-30 సంవత్సరాల ఎక్స్ పీరియన్స్ ఉన్న పలువురు సీనియర్ ఉద్యోగులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. యాపిల్ కంపెనీ తన గ్లోబల్ సేల్స్ ఆపరేషన్లలో డజన్ల మంది ఉద్యోగులను తొలగించినట్లు బ్లూమ్ బెర్గ్ వెల్లడించింది.
లే ఆఫ్స్ తీసుకున్న వారిలో కార్పొరేట్ సంస్థలు, స్కూళ్లు, ప్రభుత్వ ఏజెన్సీలతో కలిసి పనిచేసే సెల్స్ టీమ్స్ ఎంప్లాయిస్ ఎక్కువగా ఉన్నారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV