
కాణిపాకం, 25 నవంబర్ (హి.స.) కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయ (Kanipaka Vara Siddhi Vinayaka Temple Trust) ట్రస్టు బోర్డు నియామకం జరిగింది. 15 మంది సభ్యులతో కూడిన పాలకమండలిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు నియాకానికి సంబంధించిన ఆదేశాలను ప్రభుత్వం జారీ చేసింది. సభ్యులు రెండేళ్లపాటు పదవిలో కొనసాగుతారని ప్రభుత్వం పేర్కొంది. అదే విధంగా పాలకమండలి చైర్మన్ ఎన్నికకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అందుకోసం తగిన చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ కమిషనరుకు ప్రభుత్వం సూచించింది.
స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి 16మందితో ట్రస్టు బోర్డు ఖరారైన నేపథ్యంలో చైర్మన్‌గా మణి నాయుడు అలియాస్ సురేంద్రను ఖరారు చేసినట్లు సమాచారం.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV