
తిరుపతి, 25 నవంబర్ (హి.స.) పరకామణి చోరీ కేసులో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి (Bhumana Karunakar Reddy) నోటీసులు జారీ అయ్యాయి. విచారణకు హాజరు కావాలని కరుణాకర్ రెడ్డిరి సీఐడీ అధికారులు నోటీసులను జారీ చేశారు.
మాజీ ఏవీఎస్ఓ సతీష్ ఫిర్యాదు మేరకు తిరుమల ఒకటో పట్టణ పోలీసు స్టేషనులో పరాకమణి కేసు నమోదు అయ్యింది. సతీష్ కుమార్, రవికుమార్ రాజీపడి కేసును మూసివేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరాకమణి చోరీ కేసుకు సంబంధించి కోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టింది. సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యనార్ (CID) సారథ్యంలో తిరుపతిలో పద్మావతి గెస్ట్ హౌజ్ లో విచారణ కొనసాగుతోంది. నేడు సాయంత్రం నాలుగు గంటలకు విచారణకు హాజరు కావాలని సీఐడీ కరుణాకర్ రెడ్డిని ఆదేశించింది.
డిసెంబర్ 2న సీల్డ్ కవరులో నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో పరాకమణి చోరీకి సంబంధించిన విచారణను సీఐడి అధికారులు వేగవంతం చేశారు. గతంలో మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ కు విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసులిచ్చింది. ఈ క్రమంలో ఆయన అనంతపురం జిల్లా తాడిపత్ర సమీపంలో అనుమానాస్పద స్థితిలో మరణించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV