
అమరావతి, 25 నవంబర్ (హి.స.) ఏపీలోని కూటమి ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తోంది పంచ సూత్రాలు కాదు.. పంచ మోసాలు అని రాష్ట్ర కాంగ్రెస్ (Congress) చీఫ్ వైయస్ షర్మిలా అన్నారు.
ఏపీ పరభుత్వం పంచ సూత్ర సంక్షేమం పేరిట బూటకానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ ఎక్స్ వేదికగా విమర్శల వర్షం కురిపించారు. 17 నెలలుగా ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని గాలికొదిలేసిందన్నారు. రైతన్నలను అప్పుపాలు చేసిందని ఆరోపించారు. సాగుకు సమాధి కట్టి.. అన్నదాతలకు మేలు చేసేందుకు పంచ సూత్రాల రాగం అందుకోవడాన్ని తప్పుబట్టారు. రైతన్నా మీకోసం అంటూ వారి వద్ద వెళ్లేది కేవలం ప్రచార ఆర్భాటం కోసమేనన్నారు.
ప్రకృతి వైపరీత్యాలకు జరిగిన నష్టాన్ని ఎగ్గొట్టారని.. మద్ధతు ధర కల్పించకుండా మోసం చేశారని ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV