
అమరావతి, 26 నవంబర్ (హి.స.)తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. రానున్న 24 గంటల్లో పశ్చిమ–వాయువ్య దిశలో కదిలి మరింతగా బలపడనుంది. మధ్య బంగాళాఖాతానికి చేరే క్రమంలో బలహీనపడనుంది. అటు బుధ, గురువారాల్లో వాయుగుండం దిశపై మరింత స్పష్టత లభించే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే శ్రీలంక–నైరుతి బంగాళాఖాతం పరిసరాల్లో మరొక అల్పపీడనం ఏర్పడింది. బుధవారం తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. తర్వాతి 24 గంటల్లో ఇది కూడా వాయుగుండంగా బలపడే ఛాన్స్ ఉందన్నారు. రెండు వాయుగుండాలు ఉత్తర తమిళనాడు తీరం దిశగా కదలనున్నాయని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత కోస్తాంధ్ర వైపునకు చేరుకుని బలహీనపడనున్నాయి. నవంబర్ 30, డిసెంబర్ 1న తెలంగాణలో అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV