
కృష్ణా జిల్లా 26 నవంబర్ (హి.స.)
:కృష్ణా జిల్లాలోనిగుడివాడ యూనియన్ బ్యాంకులో భారీ అగ్నిప్రమాదం)జరిగింది. బైపాస్ రోడ్డులోని బ్యాంకు కార్యాలయం నుంచి ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. సంఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. బ్యాంకు అద్దాలు పగలగొట్టి మంటలను అదుపు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. మంటలు ఇంకా అదుపులోకి రాలేదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ