మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన సోదరుడు రామును సిట్ కస్టడీ లోకి
విజయవాడ 26 నవంబర్ (హి.స.) :నకిలీ మద్యం తయారీ కేసులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్‌, ఆయన సోదరుడు రామును సిట్‌ కస్టడీలోకి తీసుకునేందుకు న్యాయస్థానం అనుమతించింది. ప్రస్తుతం వారిద్దరూ నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్నారు. ఈ కేసులో విచారి
మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన సోదరుడు రామును సిట్ కస్టడీ లోకి


విజయవాడ 26 నవంబర్ (హి.స.)

:నకిలీ మద్యం తయారీ కేసులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్‌, ఆయన సోదరుడు రామును సిట్‌ కస్టడీలోకి తీసుకునేందుకు న్యాయస్థానం అనుమతించింది. ప్రస్తుతం వారిద్దరూ నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్నారు. ఈ కేసులో విచారించేందుకు వారిని వారం రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని ఎక్సైజ్‌ పోలీసులు కోరగా.. బుధవారం నుంచి నాలుగు రోజులపాటు కస్టడీకి ఇస్తూ విజయవాడలోని ఆరో అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు న్యాయాధికారి జి.లెనిన్‌బాబు మంగళవారం తీర్పు ఇచ్చారు. కాగా, నకిలీ మద్యం తయారీ కేసులో నిందితులకు న్యాయస్థానం రిమాండ్‌ను పొడిగించింది. నెల్లూరులోని కేంద్ర కారాగారంలో ఉన్న ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావుతోపాటు మాజీ మంత్రి జోగి రమేష్‌, ఆయన సోదరుడు జోగి రాము, సయ్యద్‌ హాజి, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, మిథున్‌దాస్‌, అంతాదా్‌సలను మంగళవారం పోలీసులు విజయవాడలోని ఆరో అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరిచారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande