
తిరుమల, 26 నవంబర్ (హి.స.)తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే టిటిడి బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని మరోసారి భక్తులకు తెలియజేసింది. డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయని స్పష్టం చేసింది.
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే టిటిడి బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని మరోసారి భక్తులకు తెలియజేసింది. డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయని స్పష్టం చేసింది. మొదటి మూడు రోజులకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా దర్శన టోకెన్ల జారీ చేయనున్న టీటీడీ.. చివరి 7 రోజుల్లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2 ద్వారా భక్తులకు సర్వదర్శనం కల్పించనుంది. మొదటి మూడు రోజుల్లో SED (Special Entry Darshan), శ్రీవాణి దర్శనాలు రద్దు చేసిన టిటిడి.. స్థానికులకు ప్రత్యేక అప్లికేషన్ ద్వారా టికెట్ల బుకింగ్ కు అవకాశం కల్పించింది. వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో తిరుపతిలో SSD (Slotted Sarva Darshan) టోకెన్ల జారీ నిలిపివేతకు నిర్ణయం తీసుకుంది. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ దర్శనాలు, ఇతర ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేసింది.
ఆన్ లైన్ అప్లికేషన్ ద్వారా దాతలకు దర్శన బుకింగ్ కు అవకాశం కల్పించింది. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు కూడా చేపట్టింది. ఇందులో భాగంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ పలు నిర్ణయాలు తీసుకుంది.
వైకుంఠ ద్వార దర్శనాల విధి, విధానాలు ఇవే..
ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా దర్శన టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, నూతన సంవత్సరం సందర్భంగా మొదటి మూడు రోజులు వైకుంఠద్వార దర్శనాలకు అంటే డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా సర్వ దర్శన టోకెన్లను ఆన్ లైన్ లో కేటాయినుంది. కుటుంబ సభ్యులందరికీ అందుబాటులో ఉండే విధంగా 1+3 విధానంలో టోకెన్లు జారీచేయనుంది.
ఎలక్ట్రానిక్ డిప్ కు అవకాశం.. వాట్సప్ ద్వారా రిజిస్ట్రేషన్..
ఇక నవంబర్ 27 నుండి డిసెంబర్ 1వ తేది వరకు ఎలక్ట్రానిక్ డిప్ నమోదుకు టీటీడీ అవకాశం కల్పించింది. మొదటి మూడు రోజులకు వైకుంఠ ద్వారా దర్శనాలకు నవంబర్ 27వరకు ఉదయం 10 గంటల నుండి డిసెంబర్ 1 సాయంత్రం 5 గంటల వరకు టీటీడీ వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in/, మొబైల్ యాప్ https://apps.apple.com/in/app/ttdevasthanams/, వాట్సాప్ లో ఏపీ గవర్నమెంట్ బాట్ లో టీటీడీ ఆలయాల విభాగంలో ఎలక్ట్రానిక్ డిప్ కు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 2న మధ్యాహ్నం 2 గంటలకు ఎలక్ట్రానిక్ డిప్ వివరాలు భక్తులకు అందించనుంది.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV