
అమరావతి, 26 నవంబర్ (హి.స.) ఆంధ్రప్రదేశ్‌లో విదేశీ పెట్టుబడులు, ఎన్ఆర్ఐలతో సంబంధాలను బలపరుచుకోవడమే లక్ష్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేశ్ USA-2.0 టూర్‌కు సన్నద్ధమవుతున్నారు. డిసెంబర్ 6న మంత్రి లోకేశ్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి డలస్‌కు చేరుకుంటారు. అక్కడ ఎన్ఆర్ఐలతో ప్రాథమిక భేటీలు నిర్వహిస్తారు. డిసెంబర్ 7న టెక్సాస్‌లోని గార్లాండ్ నగరంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఆ మీటింగ్‌లో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడి అవకాశాలపై విస్తృతంగా చర్చ జరగనుంది. సుమారు 8 వేల మంది ఎన్ఆర్ఐలు ఆ సమావేశంలో పాల్గొననున్నారు. ఇక డిసెంబర్ 8, 9 తేదీల్లో శాన్‌ఫ్రాన్సిస్కోలో మైక్రోసాఫ్ట్, గూగుల్, టెస్లా వంటి ప్రపంచ ప్రముఖ కంపెనీల సీనియర్ అధికారులతో రెండు రోజుల వ్యవధిలో మంత్రి లోకేశ్ వరుసగా భేటీ అవుతారు. ఐటీ, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో ఏపీకి పెట్టుబడులు రప్పించేందుకు వారితో చర్చలు జరపునున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV