శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం : హోం మంత్రి
అమరావతి, 26 నవంబర్ (హి.స.) రాష్ట్రంలో శాంతి భద్రతల (Law And Order) పరిక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) అన్నారు. వెలగపూడి సచివాలయంలోని కార్యాలయంలో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క
అనిత


అమరావతి, 26 నవంబర్ (హి.స.) రాష్ట్రంలో శాంతి భద్రతల (Law And Order) పరిక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) అన్నారు.

వెలగపూడి సచివాలయంలోని కార్యాలయంలో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజీత్‌ ఐపీఎస్‌, స్పెషల్ సెక్రటరీ విజయ్‌కుమార్‌ ఐపీఎస్‌, పీటీవో ఎస్పీతో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ శాంతిభద్రతల పరిక్షణకు సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలోని శాంతిభద్రత పరిస్థితులు, నేర నియంత్రణ, టెక్నాలజీ వినియోగం, పోలీస్‌ విభాగానికి అవసరమైన వనరులపై సమగ్రంగా చర్చించారు.

నేర నియంత్రణకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వసతుల విషయంలో ప్రభుత్వం రాజీపడదని స్పష్టం చేశారు. త్వరలోనే అన్ని పోలీస్‌ స్టేషన్లకు కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకురావడానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande