
మలికీపురం, 26 నవంబర్ (హి.స.) ఇటీవల ఏలూరు జిల్లాలో పర్యటించిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని మలికీపురం మండలంలోని గూడపల్లికి ఆయన చేరుకున్నారు. ఇటీవల తుఫాను కారణంగా కేశనపల్లి వద్ద కొబ్బరిచెట్లు దెబ్బతిన్నాయి. ఆ ప్రాంతానికి వెళ్లిన ఉపముఖ్యమంత్రి అక్కడ పర్యటించారు. సముద్రం నీరు చేరి దెబ్బతిన్న కొబ్బరి తోటలను స్వయంగా పరిశీలించారు. రైతులు, అధికారులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV