టీటీడీకి భారీ విరాళం ఇచ్చిన భక్తుడు
తిరుమల, 26 నవంబర్ (హి.స.) టీటీడీకి మరోసారి భారీ విరాళం (Donation) అందింది. దాత మంతెన రామలింగ రాజు రూ.9కోట్లను విరాళంగా ఇచ్చారు. కూతురు నేత్ర, అల్లుడు వంశీ పేరిట విరాళాన్ని అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, ఎంపీ అప్పలనాయుడు సమక్షంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయు
తిరుమల


తిరుమల, 26 నవంబర్ (హి.స.)

టీటీడీకి మరోసారి భారీ విరాళం (Donation) అందింది. దాత మంతెన రామలింగ రాజు రూ.9కోట్లను విరాళంగా ఇచ్చారు. కూతురు నేత్ర, అల్లుడు వంశీ పేరిట విరాళాన్ని అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, ఎంపీ అప్పలనాయుడు సమక్షంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు అందజేశారు.

ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ పీఏసీ 1, 2, 3 భవనాల ఆధునీకరణకు మంతె రామలింగరాజు ముందుకొచ్చారన్నారు. వారి కూతురు, అల్లుడి పేరిట విరాళాన్ని ఇచ్చారన్నారు. వారు ఇచ్చిన విరాళంతో భవనాలను ఆధునీకరిస్తామన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించాలని మంతెన రామలింగ రాజు చూసిన సేవాభావానికి అభినందనలు తెలియజేశారు.

స్వామివారి అనుగ్రహం వారితో పాటు వారి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో కూడా ఇలానే ఆధ్యాత్మిక సేవలను కొనసాగించాలని ఆకాంక్షించారు. 2012లో కూడా రామలింగ రాజు రూ.16 కోట్లు విరాళం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande