
హైదరాబాద్, 27 నవంబర్ (హి.స.)
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా
బుధవారం పారిస్ లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. యునెస్కో డైరెక్టర్ జనరల్ ఖలీద్ ఎల్ ఎనానీ సమక్షంలో ఈ విగ్రహాన్ని భారత రాయబారి, శాశ్వత ప్రతినిధి విశాల్ శర్మ ఆవిష్కరించారు. కాగా యునెస్కో కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. రాజ్యాంగ దినోత్సవం రోజున పారిస్ లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో గర్వకారణం అని పేర్కొన్నారు.
ఇది డాక్టర్ అంబేద్కర్ కు మరియు మన రాజ్యాంగ నిర్మాణంలో ఆయన కృషికి తగిన నివాళి అని అభిప్రాయపడ్డారు. ఆయన ఆలోచనలు ఆదర్శాలు అసంఖ్యాక ప్రజలకు బలాన్ని, ఆశను ఇస్తాయని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు