
హైదరాబాద్, 27 నవంబర్ (హి.స.)
కోనసీమకు తెలంగాణ నాయకుల దిష్టి
తగిలిందేమో అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ నుండి ఎవరూ కోనసీమకు వెళ్లి రాలేదన్నారు. ప్రతిరోజు అక్కడ నుండి వేలాది మంది హైదరాబాద్ కు వస్తున్నారని చెప్పారు. తగిలితే వాళ్ల దిష్టే హైదరాబాద్ కు తగులుతుందని వ్యాఖ్యానించారు. ఒక వేళ దిష్టి తగులుతుంది అనుకుంటే దిష్టి బొమ్మను పెట్టుకోవాలని సూచించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు