
హైదరాబాద్, 27 నవంబర్ (హి.స.)
నగరంలోని కూకట్పల్లి పరిధిలో
మరోసారి హైడ్రా కూల్చివేతలతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. _ కూకట్పల్లిలోని నల్ల చెరువు సమీపంలో ఉన్న ప్రకాష్ నగర్ కాలనీలో అక్రమంగా నిర్మించిన ఇళ్లను కూల్చివేయడానికి హైడ్రా (అధికారిక కూల్చివేత సిబ్బంది) బృందం బుల్డోజర్లతో పాటు పోలీసులు, హైడ్రా సిబ్బందితో వచ్చింది. దీంతో తమ ఇళ్లను కూల్చొద్దని స్థానిక పేద ప్రజలు, కాలనీవాసులు హైడ్రా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. కూల్చివేతలను అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, పునరావాసం చూపకుండా కూల్చివేతలు చేపట్టడంపై కాలనీవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు