
హైదరాబాద్, 27 నవంబర్ (హి.స.)
రావల్పిండి కారాగారంలో జైలు శిక్షను అనుభవిస్తున్న పాక్ మాజీ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ను ఆర్మీ చంపేసిందంటూ ఆఫ్ఘానిస్తాన్ ప్రసారం చేస్తున్న మీడియా కథనాలు ప్రపంచవ్యాప్తంగా దావానలంలా వ్యాపించాయి. ఇక సోషల్ మీడియాలో ఇమ్రాన్ మర్డర్ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇమ్రాన్ ఖాన్ మరణ వార్తలపై తాజాగా పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసీఫ్ రియాక్ట్ అయ్యారు.
ఇమ్రాన్ ఖాన్ సంపూర్ణం ఆరోగ్యంతో ఉన్నారని వారు తెలిపారు. ఆయనను మరో జైలుకు తరలించారని వస్తున్న వదంతులను కొట్టిపడేశారు. ఫైవ్ స్టార్ హోటల్లో కంటే ఇమ్రాన్ ఖాన్కు మెరుగైన ఆహారం అందుతోందని, జైలులో భద్రంగా ఉన్నారని ఖవాజా ఆసీఫ్ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు