
మెదక్, 27 నవంబర్ (హి.స.)
గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా
గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ను అనుసరిస్తూ మెదక్ జిల్లాలో తొలి విడత సర్పంచ్, వార్డు స్థానాలకు రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ లు జారీ చేసి, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. మెదక్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 06మండలాలైన అల్లాదుర్గం, రేగోడు, టేక్మాల్, హవేలీ గన్పూర్, పాపన్నపేట, శంకరంపేట ఆర్, 160 సర్పంచ్, 1402వార్డు స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో అల్లాదుర్గం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాలంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ గురువారం ఆకస్మికంగా సందర్శించి, అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించారు. నామపత్రాల స్వీకరణకు చేసిన ఏర్పాట్లు గమనించి పలు సూచనలు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు