
హైదరాబాద్, 27 నవంబర్ (హి.స.) హైదరాబాద్ ఇండస్ట్రీయల్ లాండ్స్ . ట్రాన్స్ఫర్మేషన్ (హిల్టప్) పాలసీపై బీఆర్ఎస్, బీజేపీ అసత్య ప్రచారం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పాలసీ అర్థం కాక ఈ ప్రచారం చేస్తున్నారో? కావాలని చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. హైదరాబాద్ నగరాన్ని పొల్యూషన్ ఫ్రీ సిటీగా మార్చేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఇది ఆకస్మికంగా తెచ్చిన పాలసీ కాదని హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు ఇండస్ట్రీలను ఓఆర్ఆర్ బయటకి పంపాలని డిమాండ్ పాతదేనన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఈ పాలసీపై చర్చ జరిగిందని చెప్పారు. ఇవాళ గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఉత్తమ్.. ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిందని అలాంటి పరిస్థితి హైదరాబాద్కు రాకూడదని ప్రభుత్వం భావిస్తోందన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు