
హైదరాబాద్, 27 నవంబర్ (హి.స.) రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు మాజీ సీఎం కేసీఆర్కు అప్పట్లో ఓ ఎస్ డి గా పనిచేసిన రాజశేఖర్ రెడ్డిని సిట్ అధికారులు నోటీసులు ఇవ్వగా, ఆయన ఇవాళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు విచారణ నిమిత్తం హాజరయ్యారు. దాదాపు 2 గంటల పాటు సిట్ అధికారులు రాజశేఖర్ రెడ్డిని విచారించి, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ను ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎన్క్లోజ్ చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..