ఖమ్మం జిల్లాలో ఎన్నికల చెక్పోస్ట్ ఏర్పాటు..
ఖమ్మం, 27 నవంబర్ (హి.స.) స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా డిసెంబర్ 11, 12, 13 వ తేదీల్లో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ తేదీలు ప్రకటించడంతో, ఖమ్మం జిల్లా ఏనుకూరు మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా, ఎన్నికల చెక్ పోస్ట్
చెక్ పోస్ట్


ఖమ్మం, 27 నవంబర్ (హి.స.)

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా

డిసెంబర్ 11, 12, 13 వ తేదీల్లో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ తేదీలు ప్రకటించడంతో, ఖమ్మం జిల్లా ఏనుకూరు మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా, ఎన్నికల చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేసి వాహనాల తనిఖీ కార్యక్రమానికి అధికారులు చర్యలు చేపట్టారు. వాహనాలు తనిఖీ సమయంలో ఒక వ్యక్తి వద్ద రూ.50 వేలకు మించి నగదు ఉండరాదని తెలిపారు. అలా కాకుండా 50వేలుకు మించి నగదు ఉన్న డబ్బులను ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం స్వాధీనం పరుచుకొని ఎన్నికల అధికారులకు అప్పజెప్పడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి వాహనాన్ని క్షుణంగా పరిశీలించడం జరుగుతుందని, ప్రతి ఒక్క వాహనదారుడు చెకింగ్ సమయంలో పోలీసులకు సహకరించాలని, ఎన్నికల నియమావళి కి వ్యతిరేకంగా వ్యవహరించే వారి పట్ల చర్యలు ఉంటాయని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande