
నిజామాబాద్, 27 నవంబర్ (హి.స.)
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ రీజనల్ బ్యాంకులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో బ్యాంకులో ఉన్న కంప్యూటర్లు, ఏసీల తో పాటు విలువైన డాక్యుమెంట్లు కాలి బూడిదైపోయాయి. పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం రాత్రి సమయంలో గ్రామీణ బ్యాంక్ లో లోపలి నుండి దట్టమైన పొగలతో పాటు మంటలు ఎగసిపడ్డాయి. దాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు.
అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని బ్యాంకు లోపల నుండి భారీగా ఎగిసిపడుతున్న మంటలను సుమారు రెండు గంటల పాటు శ్రమించి అదుపు చేశారు.
ఈ ప్రమాదంలో 25 కంప్యూటర్లు, 7 ఏసీ లతో పాటు పలు విలువైన డాకుమెంట్స్ సైతం కాలిపోయినట్లుగా అధికారులు గుర్తించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు