నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన గజ్వేల్ ఏసిపి నర్సింహులు
సిద్దిపేట, 27 నవంబర్ (హి.స.) గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై నామినేషన్ ల కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభమైంది. సిద్దిపేట జిల్లా జగదేవ్పర్ మండలంలో అధికారులు ఏడు క్లస్టర్ లను ఏర్పాటు చేసి సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసే వారి నుంచి నామి
గజ్వేల్ ఏసిపీ


సిద్దిపేట, 27 నవంబర్ (హి.స.)

గ్రామ పంచాయతీ ఎన్నికల

నోటిఫికేషన్ విడుదలై నామినేషన్ ల కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభమైంది. సిద్దిపేట జిల్లా జగదేవ్పర్ మండలంలో అధికారులు ఏడు క్లస్టర్ లను ఏర్పాటు చేసి సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసే వారి నుంచి నామినేషన్ లను స్వీకరించారు. ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు గజ్వేల్ ఏసీపీ నర్సిహులు నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల వద్ద భద్రతా బందోబస్తు, నామినేషన్ దాఖలు కోసం ఏర్పాటు చేసిన వరుసలను అధికారులు ఎలా నిర్వహిస్తున్నారనీ అధికారులను ఏసీపీ అడిగి తెలుసుకున్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande