
హైదరాబాద్, 27 నవంబర్ (హి.స.) అయ్యప్ప మాల ధరించిన కాంచన్బాగ్
ఎస్ఐ కృష్ణకాంత్ కు డిపార్ట్మెంట్ రూల్స్ బ్రేక్ చేశాడంటూ మెమో ఇవ్వడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సంఘాలు తీవ్ర మండిపడుతున్నాయి. ఈ మేరకు ఎస్ఐకి ఇచ్చిన మోమోను బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఇవాళ బీజేవైఎం కార్యకర్తలు అయ్యప్ప స్వాములతో కలిసి డీజీపీ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో నగర పరిధిలోని అయ్యప్ప స్వాములు డీజీపీ కార్యాయానికి ఊహించని సంఖ్యలో తరలివచ్చారు. అంతకు ముందే అప్రమత్తమైన ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..