
పెద్దపల్లి, 27 నవంబర్ (హి.స.) పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో గ్రామ పంచాయతీల్లో ఎన్నికల సందడి మొదలైంది. స్థానిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా గ్రామాల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికల వేడి మొదలైంది. ఆయా గ్రామపంచాయతీలో ఆశావాహులుగా ఉన్న సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులు నామినేషన్లను వేసేందుకు సిద్ధమవుతున్నారు. ముహూర్త బలాలు చూసుకుంటూ నామినేషన్ వేసేందుకు అభ్యర్థుల సిద్ధమవుతున్నారు. మంథని మండలంలో 35 గ్రామపంచాయతీల్లో పోటీలో ఉండే సర్పంచ్, వార్డ్ మెంబర్ అభ్యర్థులు వారికి కేటాయించిన క్లస్టర్లలో నామినేషన్లను అందజేస్తున్నారు.
మంథని మండలంలో మొట్టమొదటి సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ నాయకురాలు కనవేన స్వప్న శ్రీనివాస్ తన నామినేషన్ దాఖలు చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు