
మహబూబ్నగర్, 27 నవంబర్ (హి.స.)
మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ
మండలంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు సజీవ దహనం అయ్యారు.
హన్వాడ మండలం పల్లెమొని కాలనీ - పిల్లిగుండు దగ్గర మహబూబ్ నగర్ -తాండూర్ ప్రధాన రహదారి పై బుధవారం అర్ధరాత్రి సమయంలో ఆయిల్ ట్యాంక్ వాహనం, స్టీల్ కంటైనర్ల వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆయిల్ ట్యాంక్ పేలి భారీగా మంటలు వ్యాపించాయి. ఆయిల్ ట్యాంక్ వాహన డ్రైవర్ ఆ మంటల్లో పూర్తిగా కాలిపోయి మరణించాడు. సమాచారం తెలుసుకున్న స్థానిక హన్వాడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేలా అగ్నిమాపక సిబ్బందితో పాటు ప్రయత్నం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు