
సిద్దిపేట, 27 నవంబర్ (హి.స.) సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అక్కారం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన ప్రక్రియను గురువారం జిల్లా కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మేనులో భాగంగా బగారా అన్నం, తోటకూర పప్పు వండినట్లుగా వంట సిబ్బంది తెలుపగా ఆహారపదర్థాలను తనిఖీ చేశారు. బాగారా అన్నం నాణ్యత సరిగ్గా లేనందున వంట సిబ్బంది పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజు ఇలాగే పెడుతున్నారా అంటూ బాగారా అన్నం ఎలా చేస్తారో తెలీదా అని మండిపడ్డారు. పిల్లలకు పౌష్టికాహారం అందించకుండా విధులు ఎలా నిర్వహిస్తున్నారని హెడ్ మాస్టర్ మరియు ఫుడ్ చెకింగ్ టిచర్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు