తీర్పులను తిరిగిరాయడం డేంజర్.. సుప్రీం ధర్మాసనం సెన్సేషనల్ కామెంట్స్
న్యూఢిల్లీ, 27 నవంబర్ (హి.స.) న్యాయ వ్యవస్థలో రాను రాను ముందు బెంచ్ల తీర్పులను తర్వాత బెంచ్లు తిరగరాసే సంస్కృతి పెరుగుతుండటం అత్యంత ఆందోళన కలిగించే అంశమని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ఓ హత్య కేసులో నిందితుడు దాఖలు చేసిన పిటిషన్
సుప్రీం కోర్ట్


న్యూఢిల్లీ, 27 నవంబర్ (హి.స.)

న్యాయ వ్యవస్థలో రాను రాను ముందు బెంచ్ల తీర్పులను తర్వాత బెంచ్లు తిరగరాసే సంస్కృతి పెరుగుతుండటం అత్యంత ఆందోళన కలిగించే అంశమని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ఓ హత్య కేసులో నిందితుడు దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసిహ్ ధర్మాసనం మాట్లాడిన వ్యాఖ్యలు ప్రస్తుతం న్యాయ విభాగంలో హాట్ టాపిక్గా మారాయి.

ఏదైనా ఓ కేసులో ముందు ధర్మాసనాలు ఇచ్చిన తీర్పులను ఎగువ కోర్టులు సులభంగా తిరస్కరించడం లేదా తారుమారు చేసే అంశాలు చాలా డేంజర్ అని అన్నారు. అలా జరిగితే న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుందని తెలిపారు. గతంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పును హైకోర్టు తిరస్కరించడం ఓ కేసులో వివాదాస్పదమైందని పేర్కొన్నారు. సమాన స్థాయి ధర్మాసనాల మధ్య ఈ విధమైన ఘర్షణలు న్యాయ పరిపాలనకు మంచిది కాదని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande