
హైదరాబాద్, 27 నవంబర్ (హి.స.)
హైడ్రా చీఫ్ ఏవీ రంగనాథ్ ను తెలంగాణ హైకోర్టు హెచ్చరించింది. ప్రత్యక్షంగా కోర్టులో హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. బతుకమ్మ కుంట వివాదంలో డిసెంబర్ 5వ తేదీ లోపు ప్రత్యక్షంగా వచ్చి కోర్టులో హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. కాగా, హైదరాబాద్ లోని బతుకమ్మకుంట పరిధిలోని కోర్టు వివాదంలో ఉన్న ప్రైవేటు స్థలంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయరాదన్న హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినందున కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆయనకు హైకోర్టు రంగనాథ్కు నోటీసులు జారీ చేసింది. కోర్టు వివాదంలో ఉన్న స్థలంపై యథాతథస్థితిని కొనసాగించాలని, స్థలాన్ని ఏ విధంగాను మార్పులు చేయరాదంటూ జూన్ 12న ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై చర్యలు తీసుకోవాలంటూ ఎ. సుధాకర్రెడ్డి హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ మరోసారి విచారించిన కోర్టు.. రంగనాథ్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు