
హైదరాబాద్, 27 నవంబర్ (హి.స.)
శాంతి భద్రతల విషయంలో సిసి కెమెరాలు ప్రధాన భూమిక పోషిస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం హైదరాబాద్ నగర పరిధిలో సీసీ కెమెరాల నిర్వహణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. వారికి వాహనాలు, క్రేన్లు, ఇతర సామగ్రి కూడా సమకూర్చారు. ఆ బృందాలకు పోలీసులు 'ఎంపవరింగ్ ఎవ్రీడే సేఫ్టీ టీమ్స్'గా నామకరణం చేశారు. ఈ టీమ్స్ నగరంలో సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ.. కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానంగా పని చేయనున్నాయి.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు