
వనపర్తి, 27 నవంబర్ (హి.స.)
గ్రామపంచాయతీ ఎన్నికల మొదటి
దశ నామినేషన్ స్వీకరణలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సజావుగా నిర్వహించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం నుంచి ఐదు మండలాల్లో మొదలైన నామినేషన్ స్వీకరణ ప్రక్రియలో భాగంగా, కలెక్టర్ పెద్దమందడి మండలంలోని పామిరెడ్డిపల్లి, వీరాయిపల్లి పంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన స్వీకరణ కేంద్రాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నామినేషన్ స్వీకరణలో పూర్తి పారదర్శకత ఉండాలని, కేంద్రాల్లో ఓటర్ జాబితాలను తప్పనిసరిగా ప్రదర్శించాలని, ఫారం-1 ప్రచురణను ప్రతీ కేంద్రంలో తనిఖీ చేయాలని, ప్రతిరోజూ స్వీకరించిన నామినేషన్లను సాయంత్రం టీ- పోల్ యాప్లో అప్డేట్ చేయాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..