నామినేషన్ కేంద్రాల వద్ద పగడ్బందీగా భద్రత.. వరంగల్ సిపి
హనుమకొండ, 27 నవంబర్ (హి.స.) గ్రామపంచాయితీ ఎన్నికల నామినేషన్ల నేపధ్యంలో హనుమకొండ జిల్లా ఎలక తుత్తి మండలంలోని కేశవాపూర్ క్లస్టర్ను గురువారం రోజున వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా నామినేషన్ ప్రక్రియ సజావుగా, శాంతిభద్రతల మధ్య జర
వరంగల్ సిపి


హనుమకొండ, 27 నవంబర్ (హి.స.)

గ్రామపంచాయితీ ఎన్నికల నామినేషన్ల నేపధ్యంలో హనుమకొండ జిల్లా ఎలక తుత్తి మండలంలోని కేశవాపూర్ క్లస్టర్ను గురువారం రోజున వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా నామినేషన్ ప్రక్రియ సజావుగా, శాంతిభద్రతల మధ్య జరిగేందుకు సంబంధించిన కీలక సూచనలు ఆయన అధికారులకు అందించారు. ఈ సందర్భంగా సీపీ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ నామినేషన్ కేంద్రాల వద్ద భద్రత పకడ్బందీగా ఉండాలని సూచించారు.

ఎన్నికల నియమాలను కచ్చితంగా అమలు చేయాలని అభ్యర్థులు, ప్రజలు ఎలాంటి ఒత్తిడులు లేకుండా నామినేషన్లు దాఖలు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande