
అమరావతి, 27 నవంబర్ (హి.స.)
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు కాబోయే మెడికల్ కాలేజీలు ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనసాగాలని, ప్రైవేటుకు అప్పగించొద్దని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(Mlc Bosta Satyanarayana) అన్నారు. మెడికల్ కాలేజీల(Medical Colleges) వ్యవహారంపై వైసీపీ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ పేద విద్యార్థులకు మేలు చేయాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్(Ys Jagan) మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా ప్రజలు సంతకాల సేకరణలో పాల్గొంటున్నారని గుర్తు చేశారు. అవసరం మేరకు చికిత్స అందించేందుకు కోవిడ్ సమయంలో చాలా ఇబ్బందులు పడ్డామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV