
అన్నవరం, 28 నవంబర్ (హి.స.)
చింతపల్లి: అల్లూరి జిల్లా అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో 764 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి నాలుగు సెల్ ఫోన్లు, ఒక బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు చెప్పారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. 3.9 కోట్లు ఉంటుందని చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ