
హైదరాబాద్, 28 నవంబర్ (హి.స.)
ఆధార్ అప్డేట్ పై UDAI కీలక ప్రకటన చేసింది. ఇకపై ఇంటి వద్ద నుండే ఆధార్ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నట్టు పేర్కొంది. ఆధార్ యాప్ లో త్వరలోనే ఈ సదుపాయం అందుబాటులోకి రాబోతున్నట్టు తెలిపింది. ఓటీపీ, ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఈ అప్డేట్ చేసుకోవచ్చని పేర్కొంది. ఇక ఇప్పటి నుండి ఆధార్ సెంటర్ల వద్ద క్యూలో నిలబడాల్సిన అవసరంలేదని స్పష్టం చేసింది.
ఆండ్రాయిడ్ యూజర్లు https://tinyurl.com/5hex3yay అనే లింక్ ద్వారా యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని పేర్కొంది. అదే విధంగా ఐఫోన్ యూజర్లు https://tinyurl.com/2r43hdnr లింకు ద్వారా యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. ఇదిలా ఉంటే చాలా రోజుల నుండి ఫోన్ లోనే ఆధార్ కార్డ్కు మొబైల్ నంబర్ లింక్ చేసుకునే సౌకర్యం రాబోతుంది. అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు అధికారిక ప్రకటన రానే వచ్చింది. దీంతో ఎలాంటి కష్టం లేకుండా క్షణాల్లో మొబైల్ ఫోన్ ద్వారానే ఆధార్ కార్డ్కు ఫోన్ నంబర్ లింక్ చేసుకోవచ్చు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..