చైనాలో ఘోర ప్రమాదం.. పట్టాలపై పనిచేస్తున్న వారిపైకి దూసుకెళ్లిన రైలు.. 11 మంది దుర్మరణం
హైదరాబాద్, 28 నవంబర్ (హి.స.) పట్టాలపై పనిచేస్తున్న వారిపైకి రైలు దూసుకెళ్లడంతో 11 మంది కార్మికులు దుర్మరణం చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘోర విషాద ఘటన చైనాలోని యునాన్ ప్రావిన్స్ లో చోటుచేసుకుంది. గడిచిన సంవత్సరాల్లో చైనా రైల్వే నెట్వ
చైనాలో ప్రమాదం


హైదరాబాద్, 28 నవంబర్ (హి.స.)

పట్టాలపై పనిచేస్తున్న వారిపైకి రైలు

దూసుకెళ్లడంతో 11 మంది కార్మికులు దుర్మరణం చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘోర విషాద ఘటన చైనాలోని యునాన్ ప్రావిన్స్ లో చోటుచేసుకుంది. గడిచిన సంవత్సరాల్లో చైనా రైల్వే నెట్వర్క్ లో జరిగిన అత్యంత తీవ్రమైన ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది. కున్మింగ్ నగరంలోని లుయోయాంగ్ టౌన్ రైల్వే స్టేషన్లో ఈ ప్రమాదం జరిగింది.

భూకంపాలను గుర్తించే పరికరాలను పరీక్షిస్తున్న టెస్టింగ్ రైలు ఒక రైల్వే స్టేషన్లోని వంపు వద్ద వెళ్తుండగా.. అప్పటికే ట్రాక్ పైకి వచ్చిన కార్మికులు దానిని గుర్తించలేదు. రైలు వేగంగా వచ్చి కార్మికులను ఢీ కొట్టడంతో వారు స్పాట్ లో మరణించారని, గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించామని కున్మింగ్ రైల్వే బ్యూరో వెల్లడించింది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande