
అమరావతి, 28 నవంబర్ (హి.స.)
అమరావతి,:రాజధాని అమరావతిలో అద్భుతమైన అభివృద్ధి జరుగబోతోంది. రిటర్నబుల్ ప్లాట్లను రైతులు అమ్ముకోవద్దు. భూముల ధరలు పెరుగబోతున్నాయి. బిట్స్ పిలానీ, క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటవుతున్నాయి’ అని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ నోటిఫికేషన్ ఇవ్వాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరామని చెప్పారు. మరోసారి చర్చిస్తామని ప్రకటించారు. రాజధాని రైతులకు క్యాపిటల్ గెయిన్స్ గడువును మరికొంత కాలం పాటు పొడిగించే అంశంపైనా కేంద్రంతో మాట్లాడతామని చెప్పారు.
అభివృద్ధి ఫలాలు ఎలా ఉంటాయో హైదరాబాద్‌ను చూస్తే అర్థమవుతుంది. గతంలో భూములకు అక్కడ చాలా తక్కువ ధర ఉండేది. ఇప్పుడు ఎకరా రూ.170 కోట్లు పలుకుతోంది. కొందరు రైతులు ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్‌ఎ్‌సఐ) పెంచాలని కోరుతున్నారు. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటాను. రైతులు చెప్పే ఏ సమస్యనైనా వీలైనంతవరకు పరిష్కరించేందుకు ప్రభుత్వం సి ద్ధం.అలాగే మీరంతా కలిసికట్టుగా ఉండాలి. ఐకమత్యం గా ఉంటేనే అభివృద్ధి సాధ్యం’ అని చెప్పారు. తిరుమల తరహాలో అమరావతి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ