ఏ కవికైనా సమాజానికి మేలు చేయాలని ఉంటుంది : ఎమ్మెల్యే కూనంనేని
హైదరాబాద్, 28 నవంబర్ (హి.స.) ఏ కవికైనా సమాజానికి మేలు చేయాలని తపన ఉంటుందని శాసన సభ్యుడు కూనంనేని సాంబశివరావు అన్నారు. రవీంద్ర భారతి లోని సమావేశ మందిరంలో తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం నిర్వహణలో గడ్డమీది చంద్ర మోహన్ గౌడ్ రచించిన ''జన చంద్రోదయం'' గ
ఎమ్మెల్యే కూనమనేని


హైదరాబాద్, 28 నవంబర్ (హి.స.)

ఏ కవికైనా సమాజానికి మేలు

చేయాలని తపన ఉంటుందని శాసన సభ్యుడు కూనంనేని సాంబశివరావు అన్నారు. రవీంద్ర భారతి లోని సమావేశ మందిరంలో తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం నిర్వహణలో గడ్డమీది చంద్ర మోహన్ గౌడ్ రచించిన 'జన చంద్రోదయం' గేయ సంపుటి ఆవిష్కరణ సభ జరిగింది. గ్రంథ ఆవిష్కరణ విచ్చేసిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. చంద్ర మోహన్ నిరాడంబరంగా వేమన వలె ఉంటారు అని, కాని వేమన శతకం పద్యము వలె పదునుగా ఆయన పాటలు ఉంటాయి అని చెప్పారు. సిపిఐ పూర్వ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. సాహిత్యం సామాజిక హితం కోసం అన్నారు. పాట చైతన్యం కలిగించే విధంగా ఉంటే ఆలోచన రేకెత్తిస్తుందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande