స్వదేశంలో టీమిండియాకు శ్రీలంక సవాల్.. వైజాగ్, త్రివేండ్రంలో మ్యాచ్లు..!
హైదరాబాద్, 28 నవంబర్ (హి.స.) ఇటీవలే విశ్వ విజేతగా అవతరించిన భారత జట్టు (Team India) తొలి సిరీస్కు సన్నద్ధమవుతోంది. స్వదేశంలోనే ప్రపంచకప్ను సగర్వంగా ముద్దాడిన టీమిండియా ఉపఖండ జట్టు శ్రీలంక(Srilanka)ను ఢీకొట్టనుంది. డిసెంబర్ లో ఇరుజట్ల మధ్య ఐదు మ్యా
టీమిండియా


హైదరాబాద్, 28 నవంబర్ (హి.స.)

ఇటీవలే విశ్వ విజేతగా అవతరించిన భారత జట్టు (Team India) తొలి సిరీస్కు సన్నద్ధమవుతోంది. స్వదేశంలోనే ప్రపంచకప్ను సగర్వంగా ముద్దాడిన టీమిండియా ఉపఖండ జట్టు శ్రీలంక(Srilanka)ను ఢీకొట్టనుంది. డిసెంబర్ లో ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగనుంది. దాంతో.. శుక్రవారం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) షెడ్యూల్ను ప్రకటించింది. ఈ ఐదు మ్యాచ్లకు రెండు నగరాలను మాత్రమే ఎంపిక చేసింది బీసీసీఐ.

వరల్డ్ కప్ తర్వాత కో హోస్ట్లు భారత్, శ్రీలంక తలపడుతున్న తొలి సిరీస్ ఇదే. డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 30 వరకూ జరుగబోయే ఐదు టీ20ల సిరీస్లో ఇరుజట్లు ఢీకొననున్నాయి. ఈ ఐదు మ్యాచ్లకు వైజాగ్, త్రివేండ్రం(తిరువనంతపురం) వేదిక కానున్నాయి.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande