శబరిమల వెళ్ళే భక్తులకు కేంద్ర.పొర విమాన శాఖ శుభవార్త
అమరావతి, 28 నవంబర్ (హి.స.) శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కేంద్ర పౌరవిమానయాన శాఖ శుభవార్త చెప్పింది. విమానాల్లో చెకింగ్‌ లేకుండా ఇరుముడి తీసుకెళ్లేందుకు అయ్యప్ప భక్తులకు వెసులుబాటు కల్పించింది. నేటి నుంచి అంటే శుక్రవారం (28-11-2025) నుంచి వచ్చే ఏడ
శబరిమల వెళ్ళే భక్తులకు కేంద్ర.పొర విమాన శాఖ శుభవార్త


అమరావతి, 28 నవంబర్ (హి.స.)

శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కేంద్ర పౌరవిమానయాన శాఖ శుభవార్త చెప్పింది. విమానాల్లో చెకింగ్‌ లేకుండా ఇరుముడి తీసుకెళ్లేందుకు అయ్యప్ప భక్తులకు వెసులుబాటు కల్పించింది. నేటి నుంచి అంటే శుక్రవారం (28-11-2025) నుంచి వచ్చే ఏడాది జనవరి 20వ తేదీ వరకు ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande