
హైదరాబాద్, 28 నవంబర్ (హి.స.)
విమానంలో శబరిమల వెళ్లే అయ్యప్ప
భక్తులకు పౌరవిమానయానశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. అయ్యప్ప స్వాములు తమవెంట ఇరుముడిని తీసుకుని వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఇది వరకు ఉన్న ఇరుముడిని చెక్ ఇన్ లగేజీగా పంపాలి అనే నిబంధనలను ఉపసంహరించుకుంది. ఈరోజు నుండే ఇది అమలులోకి వస్తుందని జనవరి 20వ తేదీ వరకు వెసులుబాటు వర్తిస్తుందని స్పష్టం చేసింది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..