పిల్లలకు అన్నం పెట్టలేని ప్రభుత్వం అవసరమా? హరీశ్రావు
హైదరాబాద్, 28 నవంబర్ (హి.స.) అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్లు అని డబ్బా కొట్టుకునే సీఎం రేవంత్ రెడ్డి ముందు ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు పురుగులు లేని అన్నం పెట్టు అని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం
హరీష్ రావు


హైదరాబాద్, 28 నవంబర్ (హి.స.)

అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్లు అని డబ్బా కొట్టుకునే సీఎం రేవంత్ రెడ్డి ముందు ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు పురుగులు లేని అన్నం పెట్టు అని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఎక్స్ వేదికగా ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిల్లలకు పురుగులన్నం పెట్టిన ఘటనపై స్పందించారు. ముఖ్యమంత్రి గారు.. ఇక నుంచి నేనే సమీక్షలు చేస్తానన్న మీ మాటలేమయ్యాయి? విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకే అన్న బెదిరింపులేమయ్యాయి? రెండేళ్లలో మీ వద్దనే ఉన్న విద్యాశాఖపై ఎన్ని సార్లు సమీక్షలు చేశారు? విద్యార్థులకు కల్తీ ఆహారం పెడుతున్న ఎంత మందిని జైలుకు పంపారు? అని హరీశ్ రావు ప్రశ్నల వర్షం కురిపించారు.

మీ మాటలకు విలువ లేదు, ఆచరణకు దిక్కులేదు.. అని ఆయన విమర్శించారు. బడిలో చదువుకోవాల్సిన విద్యార్థులు.. పురుగులన్నం మాకొద్దు అని రోడ్లెక్కి నిలదీస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా అసలు నువ్వేం చేస్తున్నట్లు? అని నిలదీశారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande