
హైదరాబాద్, 28 నవంబర్ (హి.స.)
సినిమా థియేటర్లలో ధరలు తగ్గించాలి
అంటూ హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద పీవైఎల్ అనే సంఘం కార్యకర్తలు సంతకాల సేకరణ కార్యకమం నిర్వహించారు. సినిమాకు వచ్చిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలు తెలుపుతూ సంతకాలు చేయాలన్నారు. థియేటర్ ముందు ఓ బోర్డు పెట్టి సంతకాలు సేకరించగా థియేటర్ సిబ్బంది వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో టికెట్, స్నాక్స్, పార్కింగ్ టికెట్ ధరలు తగ్గింలంటూ పీవైఎల్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ప్రతిఒక్కరూ తమకు మద్దతు తెలపాలని ఉద్యమం చేస్తేనే టికెట్ ధరలు తగ్గుతాయని అన్నారు.
ఈ క్రమంలో కాసేపు థియేటర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. థియేటర్ వద్ద ఆందోళన చేయవద్దని కావాలంటే కేసులు పెట్టుకోవాలని సిబ్బంది ఆందోళనకారులను అక్కడ నుండి పంపించే ప్రయత్నం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..