
హైదరాబాద్, 28 నవంబర్ (హి.స.)
హైదరాబాద్ మెట్రో.. ఎంతో మంది ఐటీ, నాన్ ఐటీ ఉద్యోగులతో పాటు, విద్యార్థులు, కామన్ పబ్లిక్ అవసరాలను తీరుస్తూ.. వారి మోస్ట్ ట్రస్టెడ్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ గా నిలిచింది. ప్రతిరోజూ లక్షలాది మంది ట్రాఫిక్ కష్టాలను తీర్చి.. గమ్య స్థానాలకు చేరుస్తోన్న హైదరాబాద్ మెట్రో.. 8 వసంతాలను పూర్తి చేసుకుని, 9వ వసతంలోకి అడుగు పెట్టనుంది. ఈ ఎనిమిదేళ్లలో మెట్రో, L&T సంస్థకు 205 అవార్డులు లభించాయి.
2012లో పబ్లిక్ - ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ (PPP) పద్ధతిలో రూ.14,132 కోట్ల వ్యయంతో మెట్రో ప్రాజెక్టును ప్రారంభమయింది. 2017 నవంబర్ 28న మియాపూర్ టు నాగోల్ వరకు మెట్రోరైలును ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఆ తర్వాత ఎల్ బీ నగర్- అమీర్ పేట మార్గంలో మెట్రో 2019 మార్చిలో ప్రారంభమైంది. 2020 ఫిబ్రవరి 7న జేబీఎస్ - ఎంజీబీఎస్ రూటులో మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం రెడ్ లైన్ లో మియాపూర్ టు ఎల్ బీ నగర్, బ్లూ లైన్ లో రాయదుర్గ్ టు నాగోల్, గ్రీన్ లైన్ లో జేబీఎస్ టు ఎంజీబీఎస్ స్టేషన్లకు మెట్రో సేవలు కొనసాగుతున్నా
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు