కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు కాళేశ్వరం నీళ్లు ఒక్క చుక్క కూడా రాలేదు: కవిత
కామారెడ్డి, 28 నవంబర్ (హి.స.) తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డికి నీళ్లు వస్తాయని, నిజామబాద్, దుబ్బాక, భాన్సువాడలకు నీళ్లు వస్తాయని ప్యాకేజీ 22 మొదలు పెట్టారన్నారు. ప్యాకేజీ 22కు మొత్తం రూ.1446 కోట్లు కావ
కవిత


కామారెడ్డి, 28 నవంబర్ (హి.స.)

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు

కవిత మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డికి నీళ్లు వస్తాయని, నిజామబాద్, దుబ్బాక, భాన్సువాడలకు నీళ్లు వస్తాయని ప్యాకేజీ 22 మొదలు పెట్టారన్నారు. ప్యాకేజీ 22కు మొత్తం రూ.1446 కోట్లు కావాలన్నారు. కానీ ఇప్పటి వరకు 450 కోట్లు ఇచ్చారని చెప్పారు. అంతే కాకుండా ప్యాకేజీ 22 కట్టాలంటే 1500 ఎకరాల భూమి కావాలన్నారు. కానీ అందులో రెండో వంతు భూమిని కూడా సేకరించలేదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కామారెడ్డి జిల్లాలో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రాలేదన్నారు.ఇంత వరకు నిజామాబాద్ కు కూడా రాలేదని చెప్పారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande