
కామారెడ్డి, 28 నవంబర్ (హి.స.) బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు
బిల్లును కల్పించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రైలు రోకో నిర్వహించారు. రైలు పట్టాలపై బైఠాయించారు. 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించి ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో 17% మాత్రమే రిజర్వేషన్ అమలు చేయడం పట్ల మండిపడ్డారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయాన్ని తెలుసుకున్న స్థానిక పోలీసులు, రైల్వే పోలీసులు వచ్చి కవితను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు