
జగిత్యాల, 28 నవంబర్ (హి.స.)
గ్రామ పంచాయతీ ఎన్నికలు
పారదర్శకంగా నిర్వహించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆర్వోలు, ఏఆర్వోలకు జరిగిన ఫేజ్-2 శిక్షణలో కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్ ప్రక్రియ కీలకమైందని, ప్రతి దశను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు. రిజర్వేషన్ పరిశీలన, నామినేషన్ల స్వీకరణ-పరిశీలన, అప్పీల్స్, గుర్తుల కేటాయింపు, అభ్యర్థుల ప్రకటనలో ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకూడదన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు