
జగిత్యాల, 28 నవంబర్ (హి.స.)
అనారోగ్యంతో చికిత్స పొందుతున్న జగిత్యాల కు చెందిన రిపోర్టర్ మహమ్మద్ షఫీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రూ.50 వేల ఆర్థిక సాయం అందించి మంచి మనసును చాటుకున్నారు. శుక్రవారం జగిత్యాల ప్రెస్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో సహాయాన్ని అందజేసిన మంత్రి లక్ష్మణ్.. పాత్రికేయులు తన ఎదుగుదలలో కీలక పాత్ర వహించారని గుర్తుచేశారు. జర్నలిస్టుల సమస్యలు ఏవైనా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. షఫీ ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని ఆసుపత్రి యాజమాన్యం తో మాట్లాడి చికిత్స త్వరగా జరిగేలా సాధ్యమైనంత బిల్లు తగ్గించేలా ప్రయత్నం చేసినట్లు తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు