
హైదరాబాద్, 28 నవంబర్ (హి.స.)
బీసీ సంక్షేమ శాఖలో భవిష్యత్తు
ప్రగతికి విద్య ఒక్కటే మార్గమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ ఆయన హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2047 లో భాగంగా బీసీ సంక్షేమ శాఖకు సంబంధించి పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ జనాభాలో 56 శాతంగా ఉన్న బీసీలు వ్యవసాయం, చేతి వృత్తులు, నైపుణ్యాలు, సాంప్రదాయ వృత్తులకు వెన్నెముకగా నిలుస్తున్నారని తెలిపారు. వారి సామాజిక ఆర్థిక పురోగతి రాష్ట్ర వృద్ధికి కీలకమైందని అన్నారు.
తెలంగాణ రైజింగ్-2047లో బీసీలు విద్యాపరంగా బలంగా, ఆర్థికంగా స్వతంత్రంగా, సామాజికంగా సాధికారత సాధించి, ఆవిష్కరణ, నైపుణ్యాభివృద్ధి రాష్ట్ర వృద్ధికి చోదకంగా ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వాన్ని ఎదుర్కొనేలా చర్యలు తీసుకోవాలన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు